ఇది అసాధ్యం అని అంటారా? పుట్టిన ప్రాణి గిట్టక మానదని శాస్త్రం చెబుతారా? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం.ఈ అనంత విశ్వంలో ఎన్నో జీవులు పుట్టి చనిపోతూ ఉంటాయి.
ఈ దైనందిత జీవితంలో అనేక ఆరోగ్య సమస్యలు వయసు రీత్యా వస్తూ ఉంటాయి.ఈ క్రమంలో జీవులు మరణిస్తూ ఉంటాయి.
మరలా పురుడు పూసుకుంటాయి.అయితే ఓ జీవి మాత్రం పుట్టడమే తప్ప మరణం ఎరుగదు అంటే మీరు నమ్ముతారా? డైనోసార్ల కాలం నాటి కంటే ముందు నుంచి ఈ జీవి తన మనుగడను సజీవంగా సాగిస్తోంది.
సంవత్సరాలు గడుస్తున్నా మరణం లేని ఆ జీవి పేరు ‘టురిటోప్సిస్ డోహ్రిని (టి.డోహ్రిని).సముద్రానికి అట్టడగున ఈ జీవులు నివసిస్తుంటాయి.95 శాతం నీటితోనే వీటి నిర్మాణం ఉంటుంది.ఈ కారణంగానే జెల్లీ ఫిష్ పూర్తిగా పాదర్శకంగా కనిపిస్తుంది.కాగా ఈ జీవికి మెదడు అనేది ఉండదు.కణాల తయారీలో జరిగే మార్పుల కారణంగా ఈ జీవి మరణం లేకుండా జీవనం కొనసాగిస్తుంది.వీటిలో వయసు పెరుగుతున్న కొత్త కణాలు తక్కువ వయసువాటిలాగే ఉంటాయి.
జెల్లీ ఫిష్‌లోని కణాల్లో జన్యువులన్నీ 2 సెట్లుగా ఉండడమే ఈ జీవికి మరణం లేకపోవడానికి కారణమని పరిశోధకులకు చెబుతున్నారు.
ఆ రెండు సెట్స్ లోని ఒక సెట్‌లో జన్యువుల్లో మార్పులు జరిగినా, రెండో సెట్‌లోని జన్యువులు విడుదల చేసే ప్రోటీన్లు కణాలను మరమ్మత్తు చేసుకుంటాయి.ఈ కారణంగానే టెలోమెర్ల పొడవు తగ్గకుండా ఉంటాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు.జెల్లీ ఫిష్‌లపై పరిశోధనలు చేసిన స్పెయిన్‌లోని ఒవిడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మనుషులు కూడా వయసు పెరగకుండా ఎక్కువ కాలం జీవించేందుకు జెల్లీ ఫిష్‌లపై చేసే ప్రయోగాలు మార్గం చూపిస్తాయని అనుకుంటున్నారు.
ఇకపోతే ఇది వారి భావన మాత్రమే.