గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి ఘటనలో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.ఈ క్రమంలో నలుగురు నిందితులను శనివారం వరకు కస్టడీలో ఉంచనున్నారు.
మరో ఐదుగురు నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం.కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.
ఇటీవల తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.నిర్వాహకుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో సుమారు 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.కేబుల్ బ్రిడ్జి మరమ్మతులో కంపెనీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
అదేవిధంగా కేవలం 125 మంది సందర్శకులను అనుమతించాల్సి ఉండగా.ఏకంగా 500 మందికిపైగా ప్రజలను అనుమతించడం కూడా ప్రమాదానికి కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ప్రమాదస్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు.