సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.అయితే సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వారికి మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు రావడం చాలా సులభంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతూ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందారు.అయితే ఇంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కేవలం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుందని టాలెంట్ లేకపోతే సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేమని ఎంతోమంది నిరూపించారు కూడా.
అయితే ఇలా సినీ వారసత్వంపై నటి జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.ధడక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఈమె నటించిన మిల్లి అనే సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి నెపోటిజంపై స్పందించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే అవకాశాలు వస్తున్నాయనే మాటలు విన్నప్పుడల్లా చాలా బాధ కలుగుతుందని ఈమె నెపోటిజంపై స్పందించారు.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఈజీగా అవకాశాలు వచ్చిన.అది కేవలం ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుందని కేవలం టాలెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయని,ఇండస్ట్రీలో నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రతిరోజు ఓ యుద్ధం చేస్తున్న అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.







