ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.సుమారు 30 మంది విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు.
వెంటనే గమనించిన హాస్టల్ సిబ్బంది బాధిత విద్యార్థినులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే ఐరన్ ట్యాబ్లెట్లు వికటించడం వలనే అస్వస్థతకు గురైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో వసతి గృహం వద్ద బాలికల తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ ఆందోళనకు టీడీపీ, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది.