జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Jabardasth Comedian Hyper Aadi ) గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న హైపర్ ఆది వెండి తెరపై కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఆది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.ఇప్పటికి చాలా సందర్భాలలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
పలుసార్లు జనసేన కార్యక్రమాలలో కూడా పాల్గొని స్పీచ్ ఇచ్చారు హైపర్ ఆది.ఇది ఇలా ఉంటే పాలిటిక్స్ ఎంట్రీ పై హైపర్ ఆది స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రి రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైపర్ ఆది.ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.పాలిటిక్స్ వేరు.ప్రొఫెషన్ వేరు.
![Telugu Hyper Aadi, Janasena, Pawan Kalyan, Roja-Movie Telugu Hyper Aadi, Janasena, Pawan Kalyan, Roja-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/Hyper-Aadi-About-Jabardasth-Roja-Nagababu-Politics.jpg)
ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జబర్దస్త్ వల్లే.నాగబాబుగారితో( Nagababu ) పాటు రోజా గారూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు.రోజా గారు జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ పాలిటిక్స్ గురించి చర్చించేవారు కాదు.జబర్దస్త్ సెట్లో ఆమె అందరితో చాలా బాగా ఉంటారు.అది అందరికీ తెలిసిన విషయమే.జబర్దస్త్ కమెడియన్లు( Jabardasth Comedians ఇంత ఎదిగారంటే ఆమె పాత్ర చాలా ఉంది.
నాగబాబు గారు ఏవిధంగా ఎంకరేజ్ చేశారో, రోజా గారు కూడా ఎంకరేజ్ చేసేవారు.పాలిటిక్స్‌కి వచ్చేసరికి సెపరేట్.నేను అభిమానించేవాళ్లు నాకు ఉంటారు.మేడమ్ గారు అభిమానించేవాళ్లు వేరే వాళ్లు ఉంటారు.రాజకీయం వేరు, జబర్దస్త్ వేరు.రోజా( Roja ) గారితో పర్సనల్‌గా ఇష్యూస్ ఏం లేవు.
ఆమె ఎప్పుడు నాతో బాగానే ఉండేవారు.లేడీ జడ్జీలలో రోజా గారు టాప్.
ఆ సీటుకి ఆమె పర్ఫెక్ట్.నేను కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో సపోర్ట్‌గా ఉన్నాను.నా పాలిటిక్స్ ఇప్పుడనే కాదు.2013 నుంచి ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను.పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు నాకు ఇష్టం.అందుకే ఆయనతో ఉన్నాను.
![Telugu Hyper Aadi, Janasena, Pawan Kalyan, Roja-Movie Telugu Hyper Aadi, Janasena, Pawan Kalyan, Roja-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Hyper-Aadijabardasth-tollywood-pawan-kalyan-politics-jana-sena-social-media.jpg)
నేను పదవుల్ని.ఎమ్మెల్యే టికెట్( Janasena MLA Ticket )లను ఆశించి నేను జనసేనకి పనిచేయడం లేదు.పవన్ గారంటే నాకు ఇష్టం.ఆయన గెలవాలని కోరుకుంటాను.ఆయన చెప్పింది చేయాలని అనుకుంటాను తప్పితే, ఆయన నుంచి ఏదీ ఆశించను.ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను.
నేను గెలవాలని కాదు.పవన్ కళ్యాణ్ గారు గెలివాలనే కోరుకుంటున్నాను.
ఈసారి కూడా జనసేన( Janasena ) తరుపున ఎన్నికల క్యాంపెయిన్‌కి వెళ్తాను ప్రచారం చేస్తాను.పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషిచేస్తాను అని చెప్పుకొచ్చారు హైపర్ ఆది.