రేపటితో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.దీంతో తెలంగాణలో మూడు స్థానాలకు అధికార కాంగ్రెస్( Congress ), ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారనే వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే తెలంగాణ నుంచి రాజ్యసభ( Rajya Sabha ) బరిలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని( Sonia Gandhi ) పార్టీ నేతలు బరిలో దింపాలని భావించారు.
కానీ సోనియా రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో సోనియా గాంధీ స్థానంలో ఏఐసీసీ ట్రెజరర్ అజయ్ మాకెన్ ( AICC Treasurer Ajay Maken )కు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.అలాగే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉందని సమాచారం.కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు రేపు నామినేషన్లను వేయనున్నారు.