ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.వెస్ట్ జావాలో మధ్యాహ్న సమయంలో ఒక్క సారిగా భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లు, కొన్ని నిర్మాణాలు కూలిపోయాయి.రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదు అయిందని అధికారులు తెలిపారు.
భూకంప తీవ్రతతో సుమారు 20 మంది మృత్యువాత పడ్డారు.మూడు వందల మందికి పైగా గాయాలపాలైయ్యారు.భూకంపంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.కాగా సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు.
ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.