Hero Suman: తమిళ్ వారితో పోలిస్తే తెలుగు వారు ఆ విషయంలో తక్కువే : హీరో సుమన్

సౌత్ ఇండియాలోనే కాకుండా ప్రస్తుతం ఇండియాలోనే అందరి దృష్టి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ పైనే ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.రాజమౌళి ( Rajamouli ) పుణ్యమా అని ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా మన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంది.

 Hero Suman About Telugu And Tamil Industries-TeluguStop.com

ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు నేటి తరం కుర్ర హీరోలు మరియు దర్శకులు.సినిమా కథ రాసే విధానంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరో కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వగలరని ప్రస్తుతం ఉన్న సినిమాలు నిరూపిస్తున్నాయి.ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) బయట ప్రపంచానికి తెలియని అనేక గుట్టు చప్పుడు కాని విషయాలు జరుగుతూ ఉంటాయి.

Telugu Rajamouli, Suman, Suman Interview, Kollywood, Tollywood-Movie

ఉదాహరణకు ఇటీవల హీరో సుమన్( Hero Suman ) ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ తెలుగు సినిమా పరిశ్రమపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.తెలుగు, తమిళ లో స్టార్ హీరోగా కొనసాగాడు సుమన్.అయితే తెలుగు తమిళ పరిశ్రమల విషయంలో కంపారిజన్ అనే విషయం వస్తే తను తమిళ్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను అని చెప్పాడు.

ఎందుకంటే అక్కడివారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు అలాగే లేని ఆర్భాటాల కోసం ఎలా పడితే అలా చెప్పి నటుడిని కమిట్ అయ్యే విధంగా ప్రేరేపించరు.కానీ తెలుగు సినిమా విషయాల్లో మాత్రం అందుకు కాస్త భిన్నమైన ధోరణి కనిపిస్తుంది సినిమా కథ చెప్పిన సమయంలో చాలా గొప్పగా ఉండబోతుంది మీ పాత్ర చాలా బాగుంటుంది షూటింగ్ జరపబోతున్నామంటూ నోటికి వచ్చిన విషయాలను చెప్పి ఆ తర్వాత అందులో సగం కూడా నెరవేర్చడంలో సక్సెస్ కాలేరు అంటూ చెప్పాడు సుమన్.

Telugu Rajamouli, Suman, Suman Interview, Kollywood, Tollywood-Movie

చాలాసార్లు తెలుగు సినిమాల వల్ల అతను అలాంటి ఇబ్బందులు గురయ్యానని ముందు ఒకటి చెబుతారు తీసేటప్పుడు పర్మిషన్ దొరకలేదని ఆ లొకేషన్ కష్టమని ఈ పాత్ర తో మీకు కాంబినేషన్స్ లేవని ఏదో ఒకటి చెప్పి సినిమాను పూర్తి చేసుకుంటారు.ఇలాంటి కొన్ని విషయాల వల్లే తెలుగు ఇండస్ట్రీ కొన్నాళ్లపాటు వెనక్కి వెళ్ళింది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది అంటూ చెబుతున్నారు సుమన్. ప్రస్తుతం సినిమా అంటేనే చాలా గ్రాండ్ గా తీయాలని దర్శకులు నిర్మాతలు భావిస్తున్న తరుణంలో ప్రతి చిత్రం గొప్పగా వస్తుందంటూ తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube