కొన్నిసార్లు కొంతమంది తమకు నచ్చిన విధంగా ఒక కథ తీసుకొని ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటారు కానీ అదే కథ తో మరొక హీరో వస్తున్నారని తెలిస్తే వెనక్కి తగ్గాలని మాత్రం ఎవ్వరు అనుకోరు.కానీ అలా చిరంజీవి ఒక సినిమా తీస్తుంటే అదే కథతో రావాలనుకున్న కృష్ణ మాత్రం వెనక్కి తగ్గారు.
పైగా కృష్ణ ఫుల్ స్టార్ డం అనుభవిస్తున్న ఆ రోజుల్లో అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా ఒక త్యాగం అనే చెప్పాలి.దాంతో చిరంజీవి జాతకం మారిపోయింది ఆ చిత్రం విడుదల అయ్యాక సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత అనేక మంచి సినిమాలు చిరంజీవికి వచ్చి పడ్డాయి.అలా చిరంజీవి స్టార్ హీరో అయ్యే అవకాశం కూడా వచ్చింది మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.
1883 లో హలీవుడ్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ అయిన సినిమా కథను తెలుగులో తీయాలనుకున్నాడు చిరంజీవి.విట్నెస్ అనే పేరుతో వచ్చిన హాలీవుడ్ త్రిల్లర్ మూవీ ని తొలుత ఇండియాకి తీసుకువచ్చింది మాత్రం మలయాళ చిత్ర పరిశ్రమ.ఒక చిన్నవాడు తన కళ్లారా చూసిన ఒక హత్య గురించి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? ఎన్ని ఇబ్బందుల్లో పడ్డాడు ? అనే విషయంపై ఈ సినిమా కథ నడుస్తుంది.మలయాళంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కన్ను ఈ చిత్రం పై పడింది.
విజయ్ బాపు అనే ఒక నిర్మాత తానే దర్శకుడిగా విటెన్స్ సినిమాని సాక్షి పేరుతో తెలుగులో కృష్ణుని హీరోగా పెట్టి తీయాలనుకున్నాడు.హీరోయిన్ గా శ్రీదేవిని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు.కానీ ఈ చిత్రం అప్పటికే చిరంజీవి హీరోగా వస్తుందని తెలియడంతో దర్శకుడు మరియు కృష్ణ వెనక్కి తగ్గారు.
మలయాళ సినిమా విజయవంతం అవడంతో అల్లు అరవింద్ ఆ హక్కులను కొనుగోలు చేసి తన బావ ఆయన చిరంజీవి హీరోగా పెట్టి సినిమా తీశారు.దాంతో కృష్ణ ఆ సినిమాని వదులుకున్నారు.
ఆ తర్వాత వచ్చిన చిరంజీవి ఖైదీ సినిమా మరియు అడవి దొంగ సినిమాలతో స్టార్ హీరోగా అవతారం ఎత్తాడు మెగాస్టార్.