వైద్యరంగంలో స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి లభించింది.మెడిసిన్ విభాగంలో విశేష కృషి చేసినందుకుగానూ 2022వ సంవత్సరానికి సంబంధించి స్వీడన్ జెనెటిస్ట్ స్వాంటె పాబోకు ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.
మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలు చేశారు.స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ టీం ఈ మేరకు ప్రకటించింది.