అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని అందరం అంటూ ఉంటాం.ఓ రైతు పంట పండించడానికి రైతు అనేక కష్టాలు పడి మార్కెట్ లోకి తీసుకుని వస్తూ ఉంటాడు.
ఈ తరుణంలో ఒక రైతు మ్యాజిక్ రైస్ ను సాగు చేస్తున్నాడు.పేరుకు తగ్గట్టుగానే ఈ రైస్ చూస్తే మ్యాజిక్ లాగే అనిపిస్తుంది.
ఈ రైతు పండించిన మ్యాజిక్ రైస్ రకం బియ్యాన్ని కేవలం పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టి తింటే చాలు అన్నం రెడీ అయిపోతుందట.గ్యాస్ స్టవ్ పై అన్నం ఉడికించవలసిన పని లేకుండా చాలా సులువుగా అన్నం రెడీ అయిపోతుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ప్రకృతి వ్యవసాయం పై మక్కువ ఉన్న కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీ రాముల పల్లె కు చెందిన శ్రీకాంత్ అనే రైతు ఈ మ్యాజిక్ బియ్యాన్ని సాగు చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.
ఈ సందర్భంగా రైతు శ్రీకాంత్ మాట్లాడుతూ.ఈ రైస్ చేసే పని చాలా అద్భుతం అని తెలియజేశాడు.అలాగే ఈ వయసులో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా కలిగి ఉండడం వలన.ఈ ఆహారం తిన్న వ్యక్తికి అరగడం కాస్త సమయం పడుతుందని .అంతలో అంత శక్తి ఉంటుందని తెలియజేశాడు.ఇతను రైతు కుటుంబం నుండి రావడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై దృష్టి పెట్టాడు.
శ్రీకాంత్ ఈ మ్యాజిక్ రైస్ సాగు చేసుకునే క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు.అలాగే ఈ రకం రైస్ ను పండించడానికి ముఖ్యంగా సుభాష్ పాలేకర్ శాస్త్రవేత్త రేడియా ప్రసంగం విని ప్రకృతి వ్యవసాయం పై ఇష్టం పెంచుకున్నట్లు తెలిపారు.
తాజాగా శ్రీకాంత్ అస్సాం రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చిన బోకాసాల్ అనే రకం బియ్యం అందరినీ ఆకట్టుకుంటుంది.బోకాసాల్ రైస్ కేవలం నీటిలో నానబెడితే చాలు ఇట్లే అన్నం రెడీ అయిపోతుంది.
చల్లటి నీళ్లలో ఈ బియ్యం వేసి చల్లటి అన్నం, అలాగే వేడి నీళ్లలో వేసి వేడి అన్నం రెడీ అవుతుందని శ్రీకాంత్ పేర్కొంటున్నాడు.

ఈ తరుణంలో గౌహతి యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనే సంస్థ ఈ బియ్యంలో 10.73 శాతం ఫైబర్, 6.8 శాతం పోషకాలు లభిస్తాయని తెలియజేసింది.ఈ రైస్ ఎలాంటి కర్రీ లేకుండా సులువుగా తినొచ్చని పేర్కొన్నాడు.అలాగే ఈ రకం బియ్యం సంబంధించి వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.ఈ మ్యాజిక్ బియ్యాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడానికి ఒక అధ్యయనం చేయాలని అంటున్నారు.చూడాలి మరి ఈ ఈ కొత్త రకమైన బియ్యాన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారో.