బిగ్ బాస్ సీజన్ 4.గత నెల 20వ తేదీన పూర్తయింది.
అయినా ఇప్పటికి ఆ బిగ్ బాస్ ని మర్చిపోలేకపోతున్నారు బిగ్ బాస్ ప్రియులు.ఇక అలాంటి బిగ్ బాస్ లో కంటెస్టెంట్లకు ఆఫర్లు మీద ఆఫర్లు వస్తున్నాయ్.
ఇక అలానే అదిరిపోయే ఆఫర్లు సొంతం చేసుకున్న కంటస్టెంట్లలో ఒకరు సోహెల్.బిగ్ బాస్ సీజన్ లో అందరికంటే ఎక్కువ ఆఫర్లు సంపాదించినా హీరో ఎవరు అంటే కళ్ళుమూసుకొని చెప్పేయచ్చుకు సోహెల్ అని.
అన్ని ఆఫర్లు రావడానికి కారణం.బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే లో సోహెల్ చేసిన పనే కారణం.
ఎవరు విన్నర్ అని అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో అభిజిత్, అఖిల్‌తో పాటు టాప్-3లో ఉన్న సోహైల్.బిగ్ బాస్ ఇచ్చిన రూ.25 లక్షల డీల్‌కు ఓకే చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు.అయితే అలా బయటకు రావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
నువ్వు అక్కడే ఉండి ఉంటే కనీసం రన్నర్ అయ్యేవాడివి.లేదా విన్నర్ అయ్యేవాడివి అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.

ఇక ఈ విషయంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సోహైల్ మరోసారి ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ నిజాలు తెలియకుండా చేసిన ఆరోపణల వల్ల రాతల వల్ల నేను ఎంతో బాధపడ్డాను.నేను విజేతను కాదని తెలిసే రూ.25 లక్షలు తీసుకున్నాననడం సరికాదు అందులో ఎలాంటి నిజం లేదు 25 లక్షల రూపాయిలు అంటే నాకు చాలా పెద్ద విషయం ఆ డబ్బు తీసుకోని రావడంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు అంటూ చెప్పుకొచ్చాడు సోహైల్ ఏది ఏమైనా సోహైల్ అన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ప్రత్యేకమైన వ్యక్తి.మరి మీరు ఏం అంటారు.