గుజరాత్‌లో నోరూరించే వంటకాలివే.. లొట్టలేసుకుంటూ తింటారు!

గుజరాత్ పర్యాటక ప్రదేశాలకు నిలయం.అలాగే రుచికరమైన వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది.

 Gujarat Then Definitely Taste These 5 Dishes, Dokla, Khandvi, Handwo, Thepla,-TeluguStop.com

గుజరాతీ ప్రజలు ఆహారాన్ని చాలా ఇష్టపడతారు.గుజరాతీ ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుంది.

మీరు గుజరాత్‌ని సందర్శించబోతుంటే అక్కడి అద్భుతమైన వంటకాల గురించి ఒక్కసారి తెలుసుకోండి
డోక్లాగుజరాతీ ఆహారంలో డోక్లా అత్యంత ప్రాచుర్యం పొందింది.అల్పాహారంలో అయినా, మధ్యాహ్న భోజనంలో అయినా, రాత్రి భోజనంలో అయినా గుజరాత్‌లో దీన్ని తినడానికి సమయం అంటూ ఉండదు.

డోక్లాను గ్రీన్ లేదా స్వీట్ చట్నీతో తినవచ్చు.డోక్లాను ఆవిరిలో వండుతారు.

చాలా తక్కువ నూనెను ఉపయోగిస్తారు.
ఖాండ్వీఈ పుల్లని,తీపి వంటకం గుజరాతలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ తయారుచేస్తారు.

శనగపిండితో చేసిన ఈ వంటకాన్ని మసాలా చట్నీతో వడ్డిస్తారు.గుజరాత్‌లోనే కాదు, మహారాష్ట్రలో కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తింటారు.
హ్యాండ్వోహ్యాండ్వోను శనగపప్పు, పెసర పప్పు, మినప పప్పులతో తయారు చేస్తారు.దీనిని తెల్ల నువ్వుల గింజలతో అలంకరిస్తారు.హ్యాండ్వో అనేది తియ్యగా ఉండే రుచికరమైన కేక్.ఇది డోక్లా మాదిరిగానే తయారు చేస్తారు.

అయితే వాటి రుచి చాలా తేడా ఉంటుంది.
థెప్లాసాధారణంగా గుజరాతీ ఫుడ్‌లో థెప్లాలు పరాఠాల్లా ఉంటాయి.

పెసరపప్పు, మైదా, శెనగపిండి, పెరుగు, జీలకర్రతో దీన్ని చాలా రకాలుగా తయారుచేస్తారు.వెల్లుల్లి ఊరగాయ లేదా పెరుగుతో దీనిని తింటారు.
ఉండియుఈ వంటకాన్ని గుజరాతీ ఆహారపు రాజు అని అంటారు.సీజన్‌లోని అన్ని కూరగాయలను కలిపి ఈ వంటకాన్ని తయారుచేస్తారు.ఇది ఒక రకమైన ఖిచ్డీ.మట్టి కుండలలో దీనిని వండుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube