పేలు కుట్టి కుట్టి చంపుతున్నాయా.. ఈ పవర్ ఫుల్ ఆయిల్ ను వాడితే వాటిని ఈజీగా తరిమికొట్టొచ్చు!

పేలు.( Lice ) చాలా మంది వీటితో సతమతం అవుతుంటారు.

 Powerful Oil For Removing Lice From Hair Details! Powerful Oil, Hair Care, Hair-TeluguStop.com

ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ కి వెళ్లే స్టూడెంట్స్ లో పేలు చాలా ఎక్కువగా ఉంటాయి.తలలో పేలు ఉండడం వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

ఎప్పుడు చూసినా తలను గోకుతూ ఉంటారు.పైగా తలలో పేలు ఉండడం వల్ల చాలా మంది రక్తహీనత బారిన కూడా పడతారు.

పేలుకు మన రక్తమే ఆహారం.అందువల్ల అవి మన రక్తాన్ని( Blood ) పీల్చేస్తాయి పైగా తలలో పేలు ఉంటే స్కాల్ప్ ఆరోగ్యం పాడవుతుంది.

జుట్టు అధికంగా రాలిపోతుంది.మరెన్నో సమస్యలు తలెత్తుతాయి.ఈ నేపథ్యంలోనే పేలును వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.మిమ్మల్ని కూడా పేలు కుట్టి కుట్టి చంపుతున్నాయా.

డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ లో కనుక వాడితే ఈజీగా పేలును త‌రిమికొట్టవచ్చు.

మరి ఇంకెందుకు లేటు ఆ ఆయిల్ ను( Lice Oil ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Coconut Oil, Care, Care Tips, Oil, Herbal Oil, Problem, Neem, Powerful Oi

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ వేపాకుతో ( Neem Leaves ) పాటు గుప్పెడు మర్రి చెట్టు వేర్లు వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.చివరిగా కొంచెం వట్టివేరు కూడా వేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

Telugu Coconut Oil, Care, Care Tips, Oil, Herbal Oil, Problem, Neem, Powerful Oi

ఈ ఆయిల్ ను తలకు పట్టించి కనీసం ప‌ది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను అప్లై చేసుకుని మరుసటి రోజు షాంపూ చేసుకోవాలి.ఈ ఆయిల్ పేలును వదిలించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

మూడు రోజులకు ఒకసారి ఈ ఆయిల్ ను కనుక రాసుకుంటే కొద్ది రోజుల్లోనే పేలు అన్నీ మాయమవుతాయి.కాబట్టి పేలు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube