నేడే భారత్-వెస్టిండీస్ రెండో వన్డే మ్యాచ్.. ఆ మూడు రికార్డులు బద్దలైయేనా..!

వెస్టిండీస్( West Indies ) పర్యటనలో భాగంగా నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగునుంది.ఈ మ్యాచ్లో ముగ్గురు కీలక ఆటగాళ్లు మూడు రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు.

 Today Is The Second Odi Match Between India And West Indies.. Will Those Three R-TeluguStop.com

తొలి వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టును భారత జట్టు బౌలర్లు కట్టడి చేయడంతో విజయం భారత్ ఖాతాలో పడింది.రెండో వన్డేలోనూ అదే ఫామ్ కొనసాగించి, వెస్టిండీస్ ను కట్టడి చేసి రెండో వన్డే గెలవాలని రోహిత్ సేన ప్రయత్నిస్తోంది.ఇక వెస్టిండీస్ జట్టు ఈ రెండో వన్డే మ్యాచ్లో గెలిచి సిరీస్ ను సజీవంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది.2006 నుండి కరేబియన్ దీవుల్లో వన్డే సిరీస్ లను భారత్ కైవసం చేసుకుంటూ వస్తోంది.అయితే ఈ మ్యాచ్లో బద్దలయ్యే ఆ మూడు రికార్డులు ఏమిటో చూద్దాం.

రవీంద్ర-జడేజా:

జడేజా 30 వన్డే మ్యాచ్లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు.ఇంకొక వికెట్ తీస్తే భారత్-వెస్టిండీస్ వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన భారత స్టార్ ఆల్ రౌండర్ గా జడేజా( Ravindra Jadeja ) మొదటి స్థానంలో నిలుస్తాడు.వెస్టిండీస్ పేసర్ కోర్ట్ని వాల్ష్ తన కెరియర్ లో భారత్ తో ఆడిన 38 మ్యాచ్లలో 44 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.

రవీంద్ర జడేజా కనీసం ఒక్క వికెట్ తీసిన భారత్- వెస్టిండీస్ వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మొదటి స్థానంలో నిలుస్తాడు.

Telugu India, Latest Telugu, Ravindra Jadeja, Rohit Sharma, Odi, Virat Kohli-Spo

విరాట్ కోహ్లీ:

తొలి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ( Virat Kohli )కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.నేడు జరిగే వన్డే మ్యాచ్లో 102 పరుగులు పూర్తి చేస్తే 13 వేల పరుగుల మార్క్ కు చేరుకుంటాడు.ఇలా జరిగితే 13000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా, అత్యంత వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా సరికొత్త రికార్డ్ సృష్టించబడుతుంది.

Telugu India, Latest Telugu, Ravindra Jadeja, Rohit Sharma, Odi, Virat Kohli-Spo

రోహిత్ శర్మ:

ఈ వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆరవ భారత బ్యాట్స్ మెన్ గా నిలుస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube