కృషి ఉడాన్ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే...

దేశంలోని రైతులకు సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించింది.దీని కింద తొలుత కిసాన్ ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు.

 Kisan Krishi Udan Scheme 53 Airports Included Under This Plan , Kisan Krishi Ud-TeluguStop.com

దీని ద్వారా దేశవ్యాప్తంగా పండ్లు, కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయి.దీని తర్వాత ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ (ఉడే దేశ్ కా ఆమ్ ఆద్మీ)ని తీసుకొచ్చింది.

దీని కింద విమానాశ్రయం ఇంటర్‌కనెక్ట్ చేయబడింది.దీని ద్వారా రైతుల ఉత్పత్తులను తరలించేందుకు కృషి ఉడాన్ పథకాన్ని ప్రారంభించారు.53 విమానాశ్రయాలు ఈ పథకంతో అనుసంధానమై ఉన్నాయని పౌర విమానయాన శాఖ తెలిపింది.ఈ పథకం ఆగస్టు 2020లో ప్రారంభించారు.

డొమెస్టిక్‌తో పాటు ఇంటర్నేషనల్ రూట్‌లో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.

దీంతో వారు పండించిన పంటకు మంచి ధర లభిస్తోంది.ప్రధానంగా ఈ పథకం ఈశాన్య ప్రాంతంలోని 25 విమానాశ్రయాలు చేరాయి.అలాగే మరో 28 విమానాశ్రయాలను చేర్చినట్లు ఆ శాఖ తెలింది.వీటిలో అదంపూర్ (జలంధర్), ఆగ్రా, అమృత్‌సర్, బాగ్డోగ్రా, బరేలీ, భుజ్, చండీగఢ్, కోయంబత్తూర్, గోవా, గోరఖ్‌పూర్, హిండన్, ఇండోర్, జైసల్మేర్, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాన్పూర్ (చాకేరి), కోల్‌కతా, నాసిక్, పఠాన్‌కోట్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, పూణే.

, రాజ్‌కోట్, తేజ్‌పూర్, తిరుచ్చి, త్రివేండ్రం, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయి.ఉడాన్ పథకం ద్వారా తమ పంటలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను రైతులు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇందుకోసం వారికి అదనపు రుసుములు ఉండవు.రైతులకు ల్యాండింగ్, పార్కింగ్, టెర్మినల్ నావిగేషన్ ల్యాండింగ్ ఛార్జీలు, రూట్ నావిగేషన్ ఫెసిలిటీ ఛార్జీలు నుంచి మినహాయింపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube