ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అవి రెండూ కూడా ప్రశాంత్ అనే పేరుతో ఉండడం విశేషం అలాగే ప్రశాంత అనే పేరుకు సోషల్ మీడియాలో కూడా హవా బాగా కనిపిస్తోంది అందుకే ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు మొట్టమొదటిగా ప్రశాంత్ గురించి చెప్పుకోవాల్సి వస్తే తాజాగా ఎవరు చేయనటువంటి ఒక కథతో వచ్చి సలార్ తో ప్రభాస్ కి హిట్టు ఇచ్చి తన క్రేజ్ ని అమాంతం పెంచుకున్నాడు.పైగా అతను చేసిన అన్ని సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా భిన్నమైన కథలు కావడం విశేషం.
అందుకే టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )కి మంచి పేరు వచ్చింది.

ఇక మరో ప్రశాంత్ విషయానికొస్తే అతడు ఎవరో కాదు హనుమాన్( Hanuman ) చిత్రంతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రశాంత్ వర్మ( Prashanth Verma ).హనుమాన్ చిత్రం ఫస్ట్ లుక్కుతోనే ఆ సినిమాకి బ్రహ్మాండమైన హైట్ క్రియేట్ అయింది ఆ తర్వాత వస్తున్న కంటెంట్ తో మహేష్ బాబుకి సైతం పోటీగా వస్తున్నట్లుగా అందరూ అనుకుంటున్నారు.

గ్రాఫిక్స్ అద్భుతంగా రావడంతో ఈ చిత్రం బాహుబలి రేంజ్ లో హిట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.ప్రశాంత వర్మ సైతం ప్రశాంత నీల్ తరహాలోనే వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు.అందుకే ఈ ప్రశాంత్ వర్మ కు కూడా ప్రస్తుతం మంచి క్రేజ్ కనిపిస్తుంది.

ఇక ముచ్చటగా మూడో ప్రశాంత్ ఎవరు అంటే అది బిగ్ బాస్ 7 సీజన్ విజేత అయిన పల్లవి ప్రశాంత్.( Pallavi Prashanth ) కామన్ మ్యాన్ గా షోలో ఎంటర్ అయి ఆట, వేట అంటూ అందరికన్నా మెరుగ్గా తన ప్రతిభను కనబరిచి టాప్ ఫైవ్ లో ఒకటిగా నిలవడమే కాకుండా కప్పును సైతం గెలిచాడు.హౌస్ నుంచి బయటకు రాగానే సరాసరి జైలు పాలైనప్పటికీ పల్లవి ప్రశాంత్ కి ఎలాంటి క్రేజ్ తగ్గలేదు.పైగా ప్రతి ఒక్కరు అతడికే సపోర్ట్ చేస్తున్నారు.అందుకే ఈ ప్రశాంత్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ని సొంతం చేసుకోగలిగాడు.