ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు తీసుకునేటువంటి నిర్ణయాలు తమ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి.తాజాగా ఓ యువతి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రియుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఏకంగా తాను నివాసం ఉంటున్నటువంటి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ముంబై నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని ఖార్ ప్రాంతంలో ప్రేమలత అనే ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.అయితే ఈమె కుటుంబ పోషణ నిమిత్తము నగరంలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది.
అయితే ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి యువకుడితో ప్రేమలత ప్రేమలో పడింది.దాంతో ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్లు.యువకుడిని నమ్మినటువంటి ప్రేమలత సర్వస్వం అర్పించింది.
అయితే ఆమె ప్రియుడు మాత్రం తన మోజు తీరిన తర్వాత ప్రేమలతను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
దీంతో ఈ మధ్య ప్రేమలత తన వివాహం గురించి తరచూ తన ప్రియుడితో గొడవపడ సాగింది.ఈ గొడవల కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు, మనస్పర్ధలు రోజురోజుకి ఎక్కువయ్యాయి.దీంతో మానసిక ప్రశాంతత మరియు విచక్షణ కోల్పోయిన ప్రేమలత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఇందులో భాగంగా తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించారు.అయితే సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.