సినీ పరిశ్రమలో విషాదం...ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు మృతి..!!

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా( Ilayaraja ) కుమార్తె సింగర్ భవతారిణి (47)( Singer Bhavatharani ) క్యాన్సర్‌తో బాధపడుతూ నేడు కన్నుమూశారు.క్యాన్సర్( Cancer ) బారిన పడిన ఆమె గత కొనాళ్ళ నుండి శ్రీలంకలో చికిత్స తీసుకుంటున్నారు.

 Famous Music Director Ilayaraja Daughter Bhavatharani Passed Away Details, Music-TeluguStop.com

ఈ క్రమంలో చికిత్స తీసుకుంటూ అక్కడే కన్నుమూయడం జరిగింది.శ్రీలంకలో ఆయుర్వేద వైద్యం కోసం తీసుకెళ్లగా.

గురువారం సాయంత్రం భవతారిణి తుది శ్వాస విడవటం జరిగింది.ఇళయరాజా కూతురు మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

భవతారిణి మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

రేపు సాయంత్రం ఆమె భౌతిక కాయం చెన్నైకి( Chennai ) రానున్నట్లు సమాచారం.చెన్నైలోనే ఆమె అంతిక్రియలు నిర్వహించనున్నారు.తండ్రి ఎల్లయ్య రాజ్య సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా( Singer ) ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

భవతారిణి దాదాపు 30 సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించారు.‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు.

కాగా అతి చిన్న వయసులోనే కూతురు మరణించటంతో ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజు. వీరిలో యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు.భవతారిణి ఎక్కువగా.తండ్రి సోదరుల దర్శకత్వంలోనే పాటలు పాడటం జరిగింది.ఇళయరాజా కూతురు మృతితో సినిపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube