ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులపై ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు.ఈడీ నోటీసులు అందాయన్న ఆయన ఈనెల 19న విచారణకు హాజరు కావాలని తెలిపారని చెప్పారు.
అయితే ఏ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందో తెలియదని వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే ఆధార్, ఓటర్ ఐడీతో సహా వ్యాపార లావాదేవీల వివరాలు తెలపాలని పేర్కొన్నారని తెలిపారు.
ఈడీ ఇచ్చిన నోటీసులను తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని, పరిశీలన అనంతరం స్పందిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.