Prabhas Anushka Shetty : ప్రభాస్ చేసిన సినిమాలలో అనుష్కకు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి ( Anushka Shetty ) ఒకరు.సూపర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మధ్య సక్సెస్ అందుకున్నారు.

 Do You Know What Is Anushkas Favorite Movie Out Of All The Movies Starring Prab-TeluguStop.com

ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అరుంధతి, బాహుబలి వంటి సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.అరుంధతి సినిమా ఈ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

అనంతరం ఈమె ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Telugu Anushka, Baahubali, Favourite, Mirchi, Namitha, Prabhas, Tollywood-Movie

ఈ విధంగా అనుష్క కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలోను అలాగే ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె హీరో ప్రభాస్ ( Prabhas ) తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.ఇలా వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై ఎంతో అద్భుతంగా ఉండడంతో ఈ జోడికి భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు.

ఇక వీరిద్దరి కెమిస్ట్రీ చూసే నిజ జీవితంలో కూడా వీరిద్దరు ప్రేమలో ఉన్నారా అని సందేహాలు వ్యక్తం చేశారు.అయితే తమది ఫ్రెండ్షిప్ అని ప్రేమ కాదు అంటూ పలు సందర్భాలలో తెలియచేసినప్పటికీ వీరిద్దరూ ఒకటైతే బాగుంటుందని ఇప్పటికే అభిమానులు ఆకాంక్షిస్తూనే ఉన్నారు.

Telugu Anushka, Baahubali, Favourite, Mirchi, Namitha, Prabhas, Tollywood-Movie

ఇలా ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు బిల్లా మిర్చి బాహుబలి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అనుష్కకు ప్రభాస్ తో చేసిన సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.మీరు ప్రభాస్ తో చేసిన సినిమాలలోనూ ఏ సినిమా అంటే అమితంగా ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ బిల్లా ( Billa )అంటే ఇష్టమని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

Telugu Anushka, Baahubali, Favourite, Mirchi, Namitha, Prabhas, Tollywood-Movie

బిల్లా సినిమాలో అనుష్క ఏకంగా బికినీలో కనిపించి సందడి చేశారు అంతేకాకుండా ఈమె పాత్రకు భారీ స్థాయిలో స్క్రీన్ స్పేస్ లభించింది దీంతో ఈమెకు ఈ సినిమా అంటే ఇష్టమని చెప్పారు అంతేకాకుండా ప్రభాస్ అనుష్క అభిమానులకు కూడా ఈ సినిమా అంటేనే అమితంగా ఇష్టమని తెలుస్తుంది.ఇక బాహుబలి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు.అయితే మరో సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కూడా ఆరాటం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube