విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) త్వరలో సమంత( Samantha )తో కలిసి శివ నిర్వాణ( Shiva Niravana ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి( kushi ) శ్రీమద ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా తర్వాత ఈయన జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇక తన 13వ చిత్రాన్ని విజయ్ దేవరకొండ దిల్ రాజు ( Dil Raju )నిర్మాణంలో డైరెక్టర్ పరశురామ్ ( Parasuram ) దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా ఘనంగా జరుపుకున్నారు.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతున్నట్టు తెలుస్తుంది.లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ రౌడీ హీరో సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ మృణాల్ జంటగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా కీలకపాత్రలో నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా విజయ్ దేవరకొండతో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నటువంటి ఆ హీరోయిన్ మరెవరో కాదు దివ్యాంశ కౌశిక్( Divyansha Kaushik ) .ఇదివరకే పలు తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.తాజాగా సిద్ధార్థ హీరోగా నటించిన టక్కర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈమె తన తదుపరి సినిమాని విజయ్ దేవరకొండతో కలిసి నటించే అవకాశం అందుకున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.