విలన్ దేవరాజ్ ఇంటిని చూశారా... ఎంత అందంగా ఉందో.. అచ్చం కోటను తలపిస్తుందిగా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని భయపెట్టిన నటుడు దేవరాజ్( Devaraj ) గురించి పరిచయం అవసరం లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 Did You See Villan Devaraj's House How Beautiful It Is ,devaraj , Chandralekha ,-TeluguStop.com

ఈయన కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగులో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.దాదాపు తెలుగు కన్నడ భాషలలో ఏకంగా 200 సినిమాలకు పైగా నటించిన దేవరాజ్ ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీడియో చేసి చూపించారు.

ఇక ఇల్లు కనక చూస్తే అచ్చం ఒక కోటను తలపిస్తుందని చెప్పాలి.ఇంటిలోకి వెళ్ళగానే సినిమా ఇండస్ట్రీలో ఆయన అందుకున్నటువంటి అవార్డులను ఫ్యామిలీ ఫోటోలను చూపించారు.ఈయన ఇంట్లోకి అడుగుపెట్టగానే అవార్డులు( Awards ), పెయింటింగ్స్ ( Paintings ),ఫ్యామిలీ ఫొటోస్ ఆకట్టుకున్నాయి.

ఇక దేవరాజ్ సైతం ఈ అవార్డ్స్ గురించి ఫ్యామిలీ ఫోటోల గురించి వివరించారు.ఇక ఈయన కన్నడ నటి చంద్రలేఖను( Chandralekha ) వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.

ఇక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి కూడా లేదని, తన స్నేహితుడు తనని బలవంతం చేస్తే థియేటర్ ఆర్టిస్టుగా వచ్చానని తాను ఇలా స్టార్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు అంటూ తెలియజేశారు.

పలు కన్నడ సినిమాలతో పాటు తెలుగులో ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, అన్న, ఎస్.పి.పరుశురాం, సమరసింహా రెడ్డి, లక్ష్యం, భరత్ అనే నేను సినిమాలో నటించారు. కన్నడ ఇండస్ట్రీలో ఈయన హీరోగా కూడా నటించే సందడి చేశారు ప్రస్తుతం ఈయన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube