మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ”విరూపాక్ష” (Virupaksha).సుకుమార్ (Sukumar) శిష్యుడు కార్తీక్ దండు (Karthik Varma Dandu) తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగి పోయాయి.
మేకర్స్ కూడా భారీ నిర్మాణ విలువలతో ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు.నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇటీవలే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆడియెన్స్ ను బాగా ఆకట్టు కుంది.ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుండి అంచనాలు భారీగానే పెరిగి పోయాయి.

నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథను సుకుమార్ అందించడం ఆయన శిష్యుడే డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అందరు ఇంట్రెస్ట్ పెడుతున్నారు.మరి ఆడియెన్స్ లో మంచి బజ్ నెలకొన్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో కూడా మంచి రిపోర్ట్స్ అందుతున్నాయి.మంచి సక్సెస్ ఫార్ములాతో థ్రిల్ చేసేందుకు ఈ సినిమా వస్తుందని అంటున్నారు.మరి ఎంత వరకు ఈ సినిమా ఆడియెన్స్ ను అలరిస్తుందో వేచి చూడాలి.

కాగా ఏప్రిల్ 21న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.ఈ మధ్య కాలంలో సుకుమార్ అసిస్టెంట్స్ అంతా హీరోలకు మంచి మంచి హిట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే.మరి సుకుమార్ ఈ అసిస్టెంట్ కూడా సాయి తేజ్ కు మంచి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.







