బుల్లితెర మీద కనిపించే కొంతమంది యాంకర్స్ కి ఒక మీడియం రేంజ్ హీరోకి ఉన్నంత క్రేజ్ మరియు పాపులారిటీ ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.ముఖ్యంగా యాంకర్ సుమ( Suma Kanakala ) గురించి మనం మాట్లాడుకోవాలి.
ఈమెని బుల్లితెర మీద మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాం.స్టార్ మా( Star Maa ) , జెమినీ , ఈటీవీ ఇలా ఏ ఛానల్ లో అయినా ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటే కచ్చితంగా సుమ యాంకరింగ్ చెయ్యాల్సిందే.
స్టార్ సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూస్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుమ కచ్చితంగా డిఫాల్ట్ గా ఉండాల్సిందే.చిన్న హీరో నుండి స్టార్ హీరో సినిమా వరకు ప్రతీ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ డేట్స్ కోసం పోటీ పడుతుంటారు దర్శక నిర్మాతలు.
ఆమె ఈ ఇండస్ట్రీ లో ఉన్న ప్రారంభం నుండి నేటి వరకు ఎంతో మంది కొత్త యాంకర్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు, కానీ ఒక్కరు కూడా సుమ రేంజ్ కి చేరుకోలేక పోయారు.
అందుకే ఆమెని యాంకరింగ్( Anchoring ) రంగం లో మెగాస్టార్ అని పిలుస్తుంటారు.టైమింగ్ తో కూడుకున్న పంచులు వెయ్యడం వల్లే సుమ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతుంది అని అంటుంటారు.కొంతమంది యాంకర్స్ లాగానే సుమ కూడా సినిమాల్లో నటించింది కానీ, వాళ్ళ రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
దీంతో ఆమె యాంకరింగ్ కి మాత్రమే పరిమితం అయ్యింది.ఇదంతా పక్కన పెడితే సుమ వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకం లాంటిది అనే చెప్పొచ్చు.ఆమె ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరి పరిచయం కస్తూరి సీరియల్ ద్వారా అయ్యింది.
వీళ్ళ పెళ్లి చాలా సులువుగా జరిగిపోయిందని అందరూ అనుకుంటూ ఉన్నారు.కానీ నిజానికి చాలా కఠినమైన పరిస్థితుల్లో జరిగిందట.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుమ ఈ విషయాల గురించి చెప్పుకొచ్చింది.
రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ని ప్రేమిస్తున్నట్టు ఇంట్లో చెప్పగానే సుమ తల్లి తండ్రులు అసలు ఒప్పుకోలేదట.మరోపక్క రాజీవ్ కనకాల కుటుంబం లో మాత్రం సుమతో పెళ్ళికి ఒప్పేసుకున్నారు.అతనితో మాట్లాడడానికి కూడా వీలు లేదని సుమని ఒక గదిలో నిర్బంధించి వారం రోజుల పాటు బయటకి రానివ్వకుండా చేశారట.
రాజీవ్ కనకాల ని తల్చుకుంటూ అన్నం నీళ్లు లేకుండా అలాగే ఉన్నింది అట సుమ.ఆమె పట్టుదల, ప్రేమ ఇవన్నీ గమనించిన తల్లితండ్రులు చివరికి రాజీవ్ కనకాల తో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారు.అలా ప్రారంభమైన వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఇక్కడి దాకా వచ్చింది, ఇంకా విజయవంతంగా కొనసాగుతూనే ఉంది.పెళ్లి తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ప్రతీ రోజు గొడవలు ఎదో ఒక విషయం లో జరుగుతూనే ఉంటాయట, కానీ వెంటనే కలిసిపోతారట.
కానీ ఒక్కసారి మాత్రం ఇద్దరు 15 రోజుల వరకు మాట్లాడుకోకుండా ఉండేవారట, అప్పుడు సోషల్ మీడియా లో విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చింది సుమ.