క్యాపిటల్ హిల్‌పై దాడి : జైళ్లలో మగ్గుతోన్న 1000 మంది, క్షమాభిక్ష పెడతానన్న వివేక్ రామస్వామి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) పోటీలో దూసుకెళ్తున్నారు.విరాళాల సేకరణ, ప్రచారం, ఇంటర్వ్యూలు, చర్చల్లో పాల్గొంటున్నారు.తాను అధ్యక్షుడినైతే డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) క్షమాభిక్ష పెడతానని కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన రామస్వామి మరోసారి బాంబు పేల్చారు.2020 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ హిల్‌లో( US Capitol ) అల్లర్లకు, విధ్వంసానికి పాల్పడి ప్రస్తుతం న్యాయ విచారణను ఎదుర్కొంటున్న వారికి క్షమాభిక్ష పెడతానని ప్రకటించారు.

 Vivek Ramaswamy Vows To Pardon Peaceful Jan 6 Protesters If Elected Us President-TeluguStop.com

దేశంలో యాంటిఫా, బీఎల్ఎం దుండగులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని.కానీ జనవరి 6 ఆందోళనకారులు మాత్రం ఇప్పటికీ బెయిల్ లభించక జైళ్లలో మగ్గుతున్నారని రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

అహింసా మార్గంలో ఆందోళన నిర్వహించిన 1000 మంది నిరసనకారులను బైడెన్ ప్రభుత్వం( President Joe Biden ) అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.తాను అధ్యక్షుడినైతే రాజకీయ కక్షలతో కేసులు ఎదుర్కొంటున్న వారికి క్షమాభిక్ష పెడతానని వివేక్ రామస్వామి ప్రకటించారు.

Telugu Capitol Hill, Donald Trump, Jan Protesters, Joe Biden, Republican, Capito

అమెరికాలో పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.కాగా.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2020 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.( US Congress ) క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు. భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.

Telugu Capitol Hill, Donald Trump, Jan Protesters, Joe Biden, Republican, Capito

బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు భద్రతా దళాలు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన అమెరికా( America ) చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది.గతంలో ఏ అధ్యక్షుడికి రానంత అప్రతిష్టను ట్రంప్ మూట కట్టుకోవాల్సి వచ్చింది.దీనిపై విచారణ నిమిత్తం అమెరికా ప్రతినిధుల సభ స్వతంత్ర కమీషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube