నాలుగో రోజు ముగిసిన టీ.బీజేపీ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో వరుసగా నాలుగో రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

 Acceptance Of T.bjp Applications Ended On The Fourth Day-TeluguStop.com

ఇందులో భాగంగా నాలుగో రోజు ఆశావహుల నుంచి సుమారు మూడు వందలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే దరఖాస్తుల కేంద్రాన్ని బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పరిశీలించారు.

అనంతరం ఆశావహుల స్పందన గురించి తెలుసుకున్నారు.కాగా ఆశావహుల నుంచి మంచి స్పందన వస్తోందని దరఖాస్తు స్వీకరణ త్రిసభ్య కమిటీ తెలిపింది.

మరోవైపు ఇప్పటివరకు పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube