తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ బ్యూటీ అమలా పాల్.ఈమె తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
కాగా ఈమె ఆ దర్శకుడితో ఇటీవల విడాకులు కూడా తీసుకుంది.అయితే అమలా పాల్ విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటనేది ఎవ్వరికీ తెలియదు.
కాగా అమలా పాల్ విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం ఓ స్టార్ హీరో అంటూ మండిపడుతున్నాడు విజయ్ తండ్రి.
దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి ఏఎల్ ఆళ్లగప్పన్ అమలా పాల్ విడాకులు తీసుకోవడంపై తాజాగా కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు.
తన కొడుకు విజయ్‌తో పెళ్లి సమయంలో అమలా పాల్ సినిమాల్లో నటించనని చెప్పిందని, కానీ పెళ్లి తరువాత ధనుష్ వచ్చి ఆమెను అమ్మా కణక్కు సినిమాలో నటించాల్సిందిగా ఒప్పించాడని తెలిపాడు.ఒక్క సినిమామాత్రమే చేస్తానని చెప్పిన ఆమె తన కొడుకును పట్టించుకోవడం మానేసిందని తెలిపాడు.
![Telugu Al Vijay, Amala Paul, Dhanush, Divorce, Kollywood-Movie Telugu Al Vijay, Amala Paul, Dhanush, Divorce, Kollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2020/02/dhanush-amala-paul.jpg)
అయితే ధనుష్‌తో వరుస సినిమాలు చేసిన అమలా పాల్, తన భర్తకు విడాకులు ఇవ్వడంలో హీరో ధనుష్ కారణమని ఏఎల్ ఆళ్లగప్పన్ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ కామెంట్లు కోలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారాయి.మరి ఈ కామెంట్లపై ధనుష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
.