సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులు పెట్టారు.
ఇక ఈ సినిమా కొన్ని చోట్ల రికార్డులకు తెరలేపింది.
తాజాగా ఈ సినిమా వైజాగ్‌లో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.వైజాగ్ జగదాంబ థియేటర్‌లో ఈ సినిమా 23 రోజులకు గాను ఏకంగా రూ.1,00,24,366 వసూళ్లు సాధించింది.సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో కోటి రూపాయల కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ వసూళ్లతో మహేష్‌కు వైజాగ్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అంటున్నారు సినీ ప్రియులు.
అటు కలెక్షన్ల పరంగానూ సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కెరీర్‌లో బెస్ట్ మూవీగా దూసుకెళుతోంది.మహేష్ బాబు యాక్టింగ్‌తో పాటు విజయశాంతి పవర్‌ఫుల్ రీఎంట్రీ, రష్మిక మందన అందాలు ఈ సినిమకు మరింత బలం చేకూర్చాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.