మనలో చాలామందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది.ఆలోచన అద్భుతంగా ఉన్నా అనుభవం లేకపోవడం వల్ల కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది.
చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందడుగులు వేస్తే సక్సెస్ కావడం కష్టం కాదని చెప్పవచ్చు.దీప్తి అవస్తి శర్మ ( Deepti Awasthi Sharma )సక్సెస్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
తను చేసిన తప్పు వల్ల నివాసం ఉన్న ఇంటిని సైతం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.సీఏ ఫైనలియర్ చదువుతున్న సమయంలో దీప్తి ఈవెంట్ బిజినెస్ ను మొదలుపెట్టారు.2014 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన దీప్తి చేసిన ఈవెంట్ వల్ల ఆమెకు 40 లక్షల రూపాయలు నష్టం వచ్చింది.టికెట్లు అమ్ముడవకపోవడం, భాగస్వామి హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆ నష్టాలను పూడ్చటానికి ఇల్లు అమ్మాల్సి వచ్చింది.ఆ తర్వాత దీప్తికి పెళ్లి జరిగింది.
పెళ్లి తర్వాత దీప్తి డిజిటల్ హోర్డింగ్స్ బిజినెస్( Digital Hoardings Business ) పై దృష్టి మళ్లింది.50,000 రూపాయల పెట్టుబడితో దీప్తి బిజినెస్ ను మొదలుపెట్టగా నేడు ఆ కంపెనీ టర్నోవర్ 20 కోట్ల రూపాయలకు చేరింది.కస్టమర్ హోర్డింగ్ ప్రస్తుత స్థితిని తెలుసుకునేలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని దీప్తి చెబుతున్నారు.నెల సమయానికి హోర్డింగ్ పొందాలంటే లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని దీప్తి తెలిపారు.
డిజిటల్ హోర్డింగ్ ధర రాష్ట్రాన్ని, లొకేషన్ ను బట్టి మారుతుందని దీప్తి చెప్పుకొచ్చారు.దీప్తి ఆవస్తి శర్మ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.దీప్తి ఆవస్తి శర్మ బిజినెస్ టర్నోవర్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాలలో దీప్తి శర్మ సత్తా చాటుతున్నారు.బిజినెస్ లో సత్తా చాటాలని భావించే వాళ్లు దీప్తిని స్పూర్తిగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.తక్కువ పెట్టుబడితో దీప్తి ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.