కరోనా విషయంలో అలా చేస్తే ఇక నుండి కేసులు తప్పవట.. హెచ్చరిస్తున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. ?

నేడు సమాజంలో మనుషులు ఎలా తయారు అయ్యారంటే పిల్లి తోకను చూసి పులి తోక అంటూ వేగంగా పుకార్లు పుట్టించే స్దాయికి ఎదిగారు.ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.

 Cybercrime Police Surveillance On Social Medi, Cybercrime Police, Surveillance,-TeluguStop.com

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గానీ, యూ ట్యూబ్ చానల్లో గానీ నకిలీ వార్తలు ఎక్కువగా ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.

అందులో కరోనా నేపథ్యంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా పుకార్లు సృష్టిస్తున్నారు.

అయితే ఇలాంటి కల్తీ గాళ్ల మీద నగర పోలీసులు నిఘా పెట్టారు.అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు.

ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై సుమోటోగా కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.ఇకపోతే గత ఏడాది ఎక్కడో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను తాజాగా హైదరాబాద్‌లో జరిగినట్లు సృష్టించిన ఓ ప్రైవేట్‌ యూట్యూబ్‌ చానల్ వీటిని ప్రచారం చేస్తూ ‌ప్రజలను ఆందోళనకు గురిచేసిన విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో, ఇలాంటి వారిపై సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిఘా పెట్టారట.

అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube