ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కావడంతో ఇప్పటి వరకు వాటి కసం ఆసక్తిగా ఎదురుచూసిన వారంతా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ పై అనేక విశ్లేషణలు చేసుకుని ఒక క్లారిటీకి వచ్చారు.టిడిపి కూటమి ( TDP alliance )అధికారంలోకి వస్తుందని కొన్ని సంస్థలు తేల్చగా, మరికొన్ని సంస్థలు వైసిపి( Ycp ) కే జనాలు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.
ఎక్కువ సంస్థలు వైసిపి నే మళ్లీ అధికారం చేపట్టబోతుందని అంచనా వేశాయి.కాకపోతే గతంలో వచ్చిన సీట్ల సంఖ్య బాగా తగ్గుతుందని , కూటమి పార్టీలకు కూడా బాగానే సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
ప్రముఖ సర్వే సంస్థ ఆరా వైసిపిదే అధికారం అని తేల్చింది.ఇక ఏ బివీపీ – సి ఓటరు సర్వే మాత్రం శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని, లోక్ సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమికే మెజార్టీ స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.
![Telugu Abvp, Chandrababu, Cross Well, Exit, Janasena, Reality Exit, Ys Jagan-Pol Telugu Abvp, Chandrababu, Cross Well, Exit, Janasena, Reality Exit, Ys Jagan-Pol](https://telugustop.com/wp-content/uploads/2024/06/Cross-voting-was-done-well-what-is-the-reality-in-the-exit-pollsc.jpg)
దీంతో భారీగా క్రాస్ ఓటింగ్( Cross voting ) జరిగినట్లుగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థం అవుతుంది .సంక్షేమ పథకాలు బాగా పనిచేయడం వల్ల జగన్ అధికారంలోకి వస్తే, మళ్లీ తమకు నగదు బదిలీ అవుతుందని, బ్యాంకుల్లో సొమ్ములు జమ అవుతాయని , ఎక్కువ మహిళలు వైసిపి వైపే మొగ్గు చూపించినట్టు గా ఎగ్జిట్ పోల్స్( Exit polls ) ద్వారా తెలుస్తోంది.అయితే ఏపీలో అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగ సమస్య , ఇతర కారణాలతో పురుష ఓటర్లు , ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపు మొగ్గు చూపించినట్టు గా తేలింది .2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ను కొన్ని సంస్థలు విడుదల చేశాయి.
![Telugu Abvp, Chandrababu, Cross Well, Exit, Janasena, Reality Exit, Ys Jagan-Pol Telugu Abvp, Chandrababu, Cross Well, Exit, Janasena, Reality Exit, Ys Jagan-Pol](https://telugustop.com/wp-content/uploads/2024/06/Cross-voting-was-done-well-what-is-the-reality-in-the-exit-pollsd.jpg)
ఎన్నికల ఫలితాలను దగ్గర దగ్గరగా చెప్పగలిగాయి.2019 ఎన్నికల్లో ఇండియా టుడే వైసిపికి 130 నుంచి 135 స్థానాలు వస్తాయని చెప్పింది.టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది .సిపిఎస్ సంస్థ వైసీపీకి 130 నుంచి 133 స్థానాలు వస్తాయని , టిడిపికి 43 నుంచి 44 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఖచ్చితమైన ఫలితం కాదు కాబట్టి, వాస్తవ ఫలితం ఏంటి అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.