తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు.
ప్రతిపక్షాలపై రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ, సీబీఐ దాడులు చేస్తుందని ఆరోపించారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలని చూస్తోందని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులకు బీజేపీ ఓ వ్యక్తిని పెట్టిందని ఆరోపించారు.దీనిని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకుని వారి నాటకాలను తిప్పి కొడుతున్నారని తెలిపారు.
షర్మిల బీజేపీ వదిలిన బాణమని ఎద్దేవా చేశారు.