ఏక‌గ్రీవాల ఎఫెక్ట్‌:  వైసీపీలో షాక్ ఎవ‌రికంటే...!

తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌ను ప్రోత్స‌హించాల‌ని వైసీపీ చూసింది.ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ కూడా ఏక‌గ్రీవాల‌పై మొగ్గు చూపించారు.

 Consensus Effect Shock In Ycp More Than Anyone Kasu Mahesh Reddy And Pinnelli Ra-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏక‌గ్రీవ పంచాయ‌తీల‌కు ఇచ్చే ప్రోత్సాహ‌కాల‌ను కూడా పెంచారు.అయితే.

బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాల‌ను ప్రోత్స‌హించ‌రాద‌ని.ఇటు ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ, అటు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కూడా నిర్ణ‌యించుకోవ‌డంతో ఈ ఏక‌గ్రీవాల‌పై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ప‌డింది.

ఇక‌, ఇప్ప‌టికే భారీ ఎత్తున గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏక‌గ్రీవాలు నిర్ణ‌యం అయ్యాయి.అయితే.

వాటి ప్ర‌క‌ట‌న చేయొద్ద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

ఫ‌లితంగా ఈ రెండు జిల్లాల్లో ఏక‌గ్రీవాలను ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు.

అయితే.ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతంలో ఏక‌గ్రీవాల‌ను ప్ర‌క‌టించ‌రాద‌ని ఎస్ ఈ సీ ఆదేశాలు జారీ చేయ‌డం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశం అయింది.

రాజ‌ధాని అమ‌రావ‌తిని త‌ర‌లించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఈ క్ర‌మంలో మూడు రాజ‌ధానుల‌కు మొగ్గు చూపింది.

అయితే.దీనికి వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

కానీ.కేవ‌లం 29 గ్రామాల్లోనే ఈ ఎఫెక్ట్ ఉంద‌ని.

మిగిలిన జిల్లా అంతా కూడా వైసీపీ వైపే ఉంద‌ని.ఆది నుంచి అధికార పార్టీ ప్ర‌చారం చేస్తోంది.

Telugu Ap, Latest, Panchayat, Ysrcp, Ysrcp Ministers-Telugu Political News

ఈ నేప‌థ్యంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఏక‌గ్రీవాల‌ను సాధించ‌డం ద్వారా.ఇక్క‌డ వినిపిస్తున్న రాజ‌ధాని వ్య‌తిరేక గ‌ళానికి చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించింది.ఈ క్ర‌మంలోనే మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌.స‌హా కీల‌క నాయ‌కులు అందరూ కూడా ఇక్క‌డ మెజారిటీ పంచాయ‌తీల‌ను ఏక‌గ్రీవం చేసుకున్నారు.అయితే.ఈ క్ర‌మంలో ఎక్కువ‌గా వివాదాలు చోటు చేసుకున్నాయి.

రాష్ట్రంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ఇక్క‌డ అనేక గొడ‌వ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.అంటే.

ఏక‌గ్రీవాల‌ను సాధించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగిన నాయ‌కులు దీనిని సాధార‌ణ స్తాయిలోసాధించేందుకు ప్ర‌య‌త్నం చేయ‌కుండా వివాదం చేయ‌డంతో ఇది రాద్ధాంతానికి దారితీసి.ఏకంగా.

ఎన్నిక‌ల క‌మిష‌న్ దీనిని ప్ర‌క‌టించేందుకు  కూడా అడ్డుక‌ట్ట వేసింది.

దీంతో ఇలాంటి వాటికి కార‌ణ‌మైన వారికి క్లాస్ తీసుకోవాల‌ని.

అస‌లు ఏక‌గ్రీవాలు చేసే విధానం ఇదేనా.? అంటూ.కొంద‌రిపై ప్ర‌బుత్వ స‌ల‌హాదారు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.ముఖ్యంగా ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, కాసు మ‌హేష్‌రెడ్డి వంటివారు దూకుడుగా వ్య‌వ‌హ‌రించార‌ని స‌మాచారం దీంతో వీరికి క్లాస్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube