టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు వరుసగా జిల్లా టూర్ లు ప్లాన్ చేసుకున్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే బాబు ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు.
పార్టీ శ్రేణులను పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లడం తో పాటు, వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు.ఈ మేరకు ముందుగానే బాబు తగిన ప్రణాళిక వేసుకున్నారు.
రేపటి నుంచి చంద్రబాబు జిల్లా టూర్లు ప్రారంభంకానున్నాయి.ఈ మేరకు షెడ్యూల్ ను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది.
ఇటీవల నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనలో భాగంగా రేపు చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస నియోజకవర్గం దల్లా వలస గ్రామం లో చేపట్టే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.
అలాగే ఈనెల ఐదో తేదీన బీమిలి నియోజకవర్గం తాళ్లవలస లో, , అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలోని కోరింగ గ్రామంలో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.
త్వరలో జరగబోయే మహానాడు కార్యక్రమం వరకు చంద్రబాబు ఈ నిరసన కార్యక్రమాల్లో వరుసగా పాల్గొనబోతున్నారు.ఇక మహానాడు ముగిసిన అనంతరం ఎన్నికలు వరకు నిత్యం ప్రజల్లో ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.
వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ, ప్రజా సమస్యలపై పోరాడే విధంగా బాబు ప్రణాళికలను రచించుకుంటున్నారు.ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే విధంగా ఎన్నో కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేసింది.

వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందని, దానిని తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో టీడీపీ అనుకున్న మేర సక్సెస్ అవుతోంది.ఏపీలో సాధారణ ఎన్నికలు ఎలా ఉన్నా… ముందస్తు ఎన్నికలు వస్తాయని బాబు బలంగా నమ్ముతున్నారు.అందుకే ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్లో రాజకీయ వేడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.