తెలంగాణలో ఎన్నికలు( Elections in Telangana ) వేల రాజకీయాలు హీటెక్కాయి.30న ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటివరకు ప్రధాన పార్టీలన్నీ ప్రచారలతో హోరెత్తించాయి.ఇక నేటితో ప్రచారాలకు కూడా తెరపడింది.దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికల వైపు మళ్ళింది.ఈసారి తెలంగాణ ఎలక్షన్స్ మునుపటి కంటే అత్యంతా ఆసక్తికరంగా మారాయి.ఎందుకంటే 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది.
కానీ ఈసారి అలా లేదు పరిస్థితులు మారిపోయాయి.బిఆర్‌ఎస్ కు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉప ఎన్నికలు, జిహెచ్‌ఎంసి ఎన్నికలతో బీజేపీ పుంజుకోగా.కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) విజయం తరువాత కాంగ్రెస్ కూడా బలపడింది.దీంతో జరిగే త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కాగా ఈసారి కూడా ప్రజలు బిఆర్‌ఎస్ కే పట్టం కడతారని 100 పైగా స్థానాల్లో తాము గెలవబోతున్నామని బిఆర్‌ఎస్ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేసిఆర్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఉందని అధికార మార్పుతప్పదని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చెబుతున్నాయి.దీంతో ఎన్నికల్లో గెలుపుపై అటు కాంగ్రెస్, బీజేపీ( Congress , BJP ) పార్టీలు కూడా ఫుల్ ధీమాగా కనిపిస్తున్నాయి.

దీంతో ఏ పార్టీ అధికారంలోకీ రాబోతుందనే దానిపై విశ్లేషకులు సైతం స్పష్టతనివ్వలేక పోతున్నారు.ఇక ఇప్పటివరకు వచ్చిన సర్వేలు సైతం ప్రజానాడీని అంచనా వేయడంలో కన్ఫ్యూజన్ నే క్రియేట్ చేశాయి.కొన్ని సర్వేలు బిఆర్‌ఎస్ కు అనుకూలంగా వస్తే మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ కు పట్టం కట్టాయి.ఇంకొన్ని సర్వేలు ఏకంగా హంగ్ రావోచ్చని చెబుతున్నాయి.దీంతో అసలు ప్రజానాడీ ఎలా ఉందనే దానిపై ఎక్కడ కూడా స్పష్టమన సమాచారం కనిపించడంలేదు.దాంతో గతంలో కంటే ఈసారి అన్నీ పార్టీలు టెన్షన్ లో కొట్టుమిట్టాడుతున్నాయి.
మరి బిఆర్‌ఎస్ చెబుతున్నట్టుగా ప్రజలు కేసిఆర్ ను మూడో సారి సిఎం చేస్తారా ? లేదా కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నట్టుగా మార్పు కోరుకుంటారా ? అనేది చూడాలి.