సుప్రీంకోర్టులో పిటిషన్.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైనే ?

సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది.దీంతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం షాక్ కు గురైంది.

 Ap Cm, Telagana Cm, Lift Irrigation-TeluguStop.com

రాయలసీమకు నీటిని తరలించాలని భావిస్తోన్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.రాయలసీయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరీ సామర్థ్యాన్ని పెంచుకుని రాయలసీయకు నీటిని తరలించాలని అనుకుంది.కానీ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో బ్రేకులు పడ్డాయి.ప్రాజెక్ట్ పనులు నిలిచేలా ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా రాయలసీమకు తరలించాలని సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చింది.

ఈ పథకంతో తమ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని, ఏపీ ప్రభుత్వం టెండర్ ప్రక్రియను చేపట్టకుండా చూడాలని పిటిషన్ లో పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు నీటి సరఫరా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

దీంతో ప్రాజెక్ట్ పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.దీనికి సంబంధించి ఈ రోజు (ఆగస్టు 5)న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ హాజరుకానని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube