గుజరాత్ రాష్ట్రంలో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని మోడీని విమర్శిస్తూ ట్విట్టర్ లో నెటిజన్ లు మండిపడుతున్నారు.దేశానికి గుజరాత్ మోడల్ అంటూ గొప్పగా చెప్పుకుంటూ అభివృద్ధిని గాలికి వదిలేసారని… తిడుతున్నారు.
అందువల్లే ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా 140 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో #GO_Back_Modi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో గుజరాత్ నుంచి బీజేపీని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.మరోపక్క వంతెన కూలిన ఘటనలో ఎంతమంది గల్లంతయ్యారు అన్నది లెక్క తేలలేదు.దీంతో గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు మచ్చు నది వద్దే వెతుకుతున్నారు.నదిలో మునిగిపోయిన వాళ్ళు కొంతమంది చనిపోయినట్లు భావిస్తున్నారు.టికెట్లు కొన్న వారి బట్టి చూస్తే ఇంకా 100 మంది ఆచూకీ లభించవలసి ఉంది.దీంతో ఇంకా నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మొత్తం ఈ దుర్ఘటనలో 140 మందికి పైగా మరణించడం జరిగింది.







