ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం దేవస్థానంలో పేలుడు కలకలం సృష్టించింది.ఆలయంలో ఓ వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది.
నిత్యాన్నదానం జరిగే ప్రాంతానికి బయటవైపు పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది.ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీశారు.
అప్రమత్తమైన ఆలయ అధికారులు పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించారు.







