ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా హైకోర్టు న్యాయవాదుల నిపుణులతో.సమావేశమయ్యారు.
విషయంలోకి వెళితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై నాయకులపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి అని.చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలుచాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించడం తెలిసిందే.ఇటువంటి తరుణంలో తాజాగా అచ్చెన్నాయుడు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాలలో తెలుగుదేశం కార్యకర్తల పై నాయకులపై నమోదైన కేసుల విషయంలో విచారణ పురోగతి ఏవిధంగా చేయాలి అన్న దానిపై.
హైకోర్టు న్యాయవాదుల నుండి సలహాలు సూచనలు తీసుకోవటం జరిగింది.
ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై వైసీపీ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.
వైసీపీ ప్రభుత్వం లోని జగన్ సలహాదారులు అనే దానికి బదులు జగన్ పైరవికారులు… అనటం చాలా బెటర్ అని.ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఒక్క సలహా కూడా ఇవ్వలేదని వ్యంగ్యంగా విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి స్పందిస్తూ జగనన్న కానుక జగనన్న దీవెన పథకం మాదిరిగానే జగనన్న చీకటి పథకం.అనే పేరు పెడితే బాగుంటుంది అని.గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీరియస్ కామెంట్లు చేశారు.