తెలంగాణ కు బిజెపి బాద్ షా! అందరిలోనూ టెన్షన్ ?

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ(BJP) అగ్ర నేతలు అంతా వరుస వరుసగా తెలంగాణకు క్యూ కడుతున్నారు.సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నిరంతరం పార్టీ శ్రేణులు యాక్టివ్ గా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు .

 Union Home Minister Amith Shah Telangana Tour Details, Telangana Bjp, Telangana,-TeluguStop.com

కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోది,  అమిత్ షా వంటి వారు ప్రత్యేకంగా తెలంగాణలో పర్యటించేందుకు వీలుగా వివిధ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు.బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని పెట్టిన కేసీఆర్ బిజెపిని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుండడంతో,  ఆ పార్టీ నే టార్గెట్ గా బిజెపి అగ్ర నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు.

తెలంగాణలో బీ ఎస్ ను ఓడించడం ద్వారా, జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే తాజాగా కేంద్ర హోమ్ మంత్రి,  బీజేపీ అగ్ర నేత అమిత్ షా (Amith Sha) ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు.

ఈరోజు రాత్రి 8:30 గంటలకు ఆయన హుకీంపేట ఎయిర్ పోర్ట్ లో దిగుతారు.అక్కడి నుంచి నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ లో రాత్రి బస చేస్తారు.అనంతరం సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, 

Telugu Amith Sha, Amithsha, Bandi Sanjay, Brs, Mlc Kavitha, Telangana, Telangana

అనంతరం కొచ్చిలో మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ బయలుదేరి వెళ్లనున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ బిజెపి నేతలతో శనివారం రాత్రి లేదా ఆదివారం కానీ అమిత్ షా కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు,  ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) వ్యవహారంలో కవిత పాత్ర , ఈడి అధికారుల విచారణ తదితర అంశాలపై అమిత్ తెలంగాణ బిజెపి నేతలతో చర్చించబోతున్నట్లు సమాచారం.అలాగే ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ వ్యవహారంలో బిజెపి పైన బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తుండడంతో,  దానిని ఏ విధంగా తిప్పుకొట్టాలి ?

Telugu Amith Sha, Amithsha, Bandi Sanjay, Brs, Mlc Kavitha, Telangana, Telangana

ఒకవేళ ఈ స్కామ్ లో కవితను (MLC Kavitha) కనుక ఈడి అధికారులు అరెస్టు చేస్తే రాజకీయంగా దానిని బిఆర్ఎస్ వాడుకుని లబ్ది పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయం పైన తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా హితబోధ చేయబోతున్నారట.ఈ పర్యటనలో తెలంగాణ బిజెపి నాయకులతో పాటు,  వివిధ రంగాలకు చెందిన మేధావులతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .ప్రస్తుతం అమిత్ షా పర్యటనపై తెలంగాణ బీజేపీ నాయకులతోపాటు,  బీఆర్ఎస్ నాయకులలోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube