తిరుపతి: తిరుపతి నగరంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశం.హాజరైన హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.
ఎన్.రావు, మాజీ ఐఎఎస్ లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్.వి.సుబ్రమణ్యం, ఎపి హైకోర్టు మాజీ న్యాయమూర్తి భవానీప్రసాద్.ఎల్.వి.సుబ్రమణ్యం, మాజీ ఐఎఎస్ అధికారి.రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నాం.
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు ప్రయత్నించాలి.రాజ్యాంగ పాలన జరగకపోతే ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయి.
శ్రీలంకలో ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోయింది.శ్రీలంకలో పాలన చేతకాక ప్రజాప్రతినిధులు పారిపోయారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తితో చర్చలు జరగాలి.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివితే అందులోని విలువైన సందేశం అందరికీ అర్థమవుతుంది.రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకుసాగితే భయపడాల్సిన అవసరం లేదు.

మనం బ్రిటీష్ కాలంలో లేము.ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.ప్రశ్నించేతత్వం అలవరుచుకోవాలి.నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ ఐఎఎస్ అధికారి.ఎపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్.ఎపిలో రాజ్యాంగ బద్థ పాలన ఎక్కడా జరగడం లేదు.
ఎపి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలి.తాజాగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎపి ప్రభుత్వం ఆదర్సంగా తీసుకోవాలి.
సచివాలయ వ్యవస్థను ఎన్నికలకు వాడుకోవడం సరైంది కాదు.సచివాలయ ఉద్యోగుల పనితీరు ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
ఎపి ప్రభుత్వ సలహాదారులుగా 50మంది ఉండడం విడ్డూరం.ప్రభుత్వ సలహాదారులతో ప్రజలకు ఉపయోగమేంటి.
సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు.ఎపిలో సమాచార శాఖ వ్యవస్థ భ్రష్టుపట్టింది.

సచివాలయ ఉద్యోగులు ఒక పార్టీకే పనిచేస్తున్నారు.బ్రిటీష్ పాలన ఎపిలో కనిపిస్తోంది.రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎపి ప్రభుత్వం పనిచేస్తోంది.హింసకు తావులేకుండా ఎపిలో ఎన్నికలు జరగాలి.ఓటర్ల నమోదులో అనేక అనుమానాలు ఉన్నాయి.ఓటర్ల నమోదు ప్రక్రియను రెండు రోజులు పొడిగించాలని కోరాం.
సిటిజన్ ఫర్ డెమోక్రసీ వినతిని ఎన్నికల కమిషనర్ తోసిపుచ్చారు.ఎన్నికలు ప్రజాస్వామ్యబద్థంగా జరగాలనే సి.ఎఫ్.డి ప్రయత్నిస్తోంది.ఎపిలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఓటర్ల నమోదు ప్రక్రియ సమర్థవంతంగా జరగకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.ఓట్ల నమోదు ప్రక్రియలో ఎన్నికల కమిషనర్ తీరు భాధాకరం.చిన్న చిన్న కేసులకు కూడా పెద్ద సెక్షన్లు వేసి అరెస్టులు చేయిస్తున్నారు.