నటి పూర్ణిమ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే సూపర్ హిట్ చిత్రాలలో “ముద్దమందారం“,”నాలుగు స్తంభాలాట”,”మా పల్లె గోపాలుడు”వంటి చిత్రాలు మనకు గుర్తుకొస్తాయి.ఈ విధంగా ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్న పూర్ణిమ ఏప్రిల్ ఒకటవ తేదీ ఎవరిని ఫూల్ చేయాలా అనే ఆలోచనలో పడ్డారు.
ఈ క్రమంలోనే కొంతమందికి ఫోన్ ట్రై చేయగా కలవకపోవడంతో, చివరికి మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ కలిపింది.
అవతల వైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారండీ.
అంది.అవతల నుంచి మీరెవరు? అని అడగడంతో నేను తన అభిమానిని అని చెప్పింది.ఒక్క నిమిషం అంటూ చెప్పగా.ఒక నిమిషం తర్వాత.”చిరంజీవి హియర్” అని వినిపించింది.దీంతో పూర్ణిమ “హలో నమస్తే సార్ నేను మీ అభిమానిని.
నా పేరు శాంతి ఒంగోలు నుంచి వచ్చాను మిమ్మల్ని చూద్దామని” అంటూ.ఎంతో ఆనందంగా చెప్పారు.
అప్పుడు చిరంజీవి ” ఓ.ఐసీ.ఏం చేస్తుంటారు అని అడగడంతో బిఎస్సి సెకండియర్ చదువుతున్నానని” చెప్పారు.అప్పుడు చిరంజీవి ఏ కాలేజ్ అని అడగడంతో? ఆమె ఒంగోలులో ఏదో చెప్పింది.

ఇలా కాసేపు వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత పూర్ణిమ నన్ను గుర్తుపట్టారా? అని అడిగి చిన్న క్లూ ఇచ్చింది… “నేను మీతో కలిసి.ఓ సినిమాలో నటించాను”అని చెప్పినప్పటికీ చిరంజీవి గుర్తుపట్టక పోకపోవడంతో నేను పూర్ణిమ అని చెప్పారు.”ఓ.పూర్ణిమ ఈరోజు ఏప్రిల్ ఒకటో తేదీ అని నాకు తెలుసు.
నువ్వు ఫోన్ చేయగానే నీతో మాట్లాడింది ఎవరో తెలుసా”? అని అడగడంతో పూర్ణమి సెక్రటరీ అంటూ సమాధానం చెప్పింది.మా సెక్రటరీ కాదు.
నేనే గొంతు మార్చుకుని అలా మాట్లాడానని చెప్పడంతో పూర్ణిమ చిరంజీవిని ఫూల్ చేయడం ఏమో కానీ ఆమె మాత్రం బాగా ఫూల్ అయ్యారు.