కరోనా కారణంగా ఆలస్యమైనప్పటికీ ఈ చిత్రం దాదాపు చివరి దశకు వచ్చేసింది.ఈ సినిమా మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు చిరు కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది.ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తున్నారు.” లూసిఫర్ ” రీమేక్ పై దృష్టి సారించనున్నారు.లూసిఫర్ చిత్రానికి మోహన్ రాజు దర్శకత్వం వహించనున్నారు.
హైదరాబాద్ లో ఇప్పటికే భారీ సెట్లు నిర్మించారు ఈ చిత్రం కోసం.ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు.
దర్శకుడు మోహన్ రాజా చాలామంది హీరోయిన్లు పేర్లను పరిగణలోకి తీసుకున్నా.మెగాస్టార్ మాత్రం నయనతార మాత్రమే కావాలని పట్టుబట్టారట.
నయనతార మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావిస్తున్నారట.ఇంతకుముందు చిరంజీవి నయనతార కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం సైరా.
నయనతార మాత్రమే కావాలని పట్టుబట్టారట, నయనతార కావాలని చిరంజీవి కోరడం.ఈ చిత్రం కోసం నయనతారకు భారీ రెమ్యునరేషన్ చెల్లించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట.ఇప్పటికే … చిత్రబృందం నుంచి ప్రతిపాదనపై నయనతార ఇంకా స్పందించలేదట. మరి నయనతార ఏమంటుందో చూడాలి.” లూసిఫర్ ” స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడం అంత సులువైన పని కాదు.రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చాలి.
మరి ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న ఈ రూమర్స్ పై త్వరలో క్లారిటీ ఏమీ వినిపిస్తుందో చూడాలి.త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.కొంత మంది బాలీవుడ్ తారలు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు.