టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది.ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.అయితే మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబును ఏ3గా చేర్చారు.