మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని( MLA Perni Nani ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై చేసే విమర్శలు వెటకారంగా ఉండటంతో పాటు నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి.
తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్‌పై పేర్ని నాని చేసిన సెటైర్లు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి.ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ సీఐడీ అధికారులు నిబంధనలు పాటించలేదని వస్తున్న విమర్శలపై పేర్ని నాని స్పందించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.
చంద్రబాబు విషయంలో సీఐడీ అన్ని నిబంధనలు పాటించిందని అన్నారు.చంద్రబాబుకు సీఐడీ అధికారులు, పోలీసులు ఎంతో మర్యాద ఇచ్చారని తెలిపారు.చంద్రబాబు ఎంత తిడుతున్నా సీఐడీ అధికారులు( CID Officers ) సంయమనం పాటించారని అన్నారు.
అరెస్ట్ సమయంలో డీఐజీ స్థాయి అధికారితో ఇష్టమొచ్చినట్టు చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు.మిమ్మల్ని మర్యాదగా కూర్చోబెట్టి ఎంత పద్ధతిగా మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు.మీరు ప్రతి ప్రశ్నకూ ఏమో, తెలీదు, గుర్తులేదు, మరిచిపోయాను అని సమాధానాలు ఇచ్చారు.జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అదేదో సినిమాలో అంటాడు.
తెలీదు, గుర్తులేదు, మరిచిపోయానని మిమ్మల్ని అడిగిన ప్రశ్నలన్నింటికీ మీరు చెప్పిన సమాధానాలు ఇవే కదా.
మిమ్మల్ని కాసేపు పడుకోమని చెప్పారు కదా.రెస్ట్ తీసుకున్నారు కదా.మీరు లేచిన తరవాత మళ్లీ ప్రశ్నలు అడిగారు కదా.మళ్లీ మీరు ఏమో, తెలీదు, గుర్తులేదు, మరిచిపోయాను అనే సమాధానాలు చెప్పారు కదా.మామూలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు మీకు పడదు.జెండా కనబడితే తిడతారు.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో డైలాగులు మాత్రం సీఐడీ వాళ్లకు చెబుతారు అంటూ పేర్ని నాని వెటకారంగా సెటైర్లు వేశారు.పనిలో పనిగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) కూడా విమర్శలు గుప్పిస్తూ నవ్వులు తెప్పించే విధంగా సెటైర్లు వేశారు.