టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి స్పందించారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాజయం తప్పదనే భయంతో ఆయనను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారని బాలయ్య ఆరోపించారు.ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు.
ఎటువంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.చంద్రబాబును జైలులో పెట్టాలన్న ఉద్దేశంతో స్కామ్ ను క్రియేట్ చేశారన్న బాలయ్య ఆయనను 16 రోజులైనా జైలులో పెట్టాలని కుట్ర పూరితంగా వ్యవహారించారని ధ్వజమెత్తారు.
సీఎం కేవలం పాలసీ మేకర్ మాత్రమేనని వెల్లడించారు.ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్న బాలకృష్ణ న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.







