మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఏడు పదుల వయసులో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) గట్టిగానే కష్టపడుతున్నారు.ఎన్నికల్లో వైసీపీని ఓడించి అధికార పీఠంపై కూర్చోవాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు మండుటెండలను సైతం పట్టించుకోకుండా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.
తాను యాక్టివ్ గా ఉంటూ జనాల్లోకి వెళ్తేనే పార్టీ నాయకులలోను ఉత్సాహం పెరిగి, ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే వేటినీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంపైనే దృష్టి సారించారు.
వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో పాటు, టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఎన్నిరకాలుగా ఏపీని అభివృద్ధి చేస్తామో, ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తమో వివరిస్తూ చంద్రబాబు పర్యటనలను కొనసాగిస్తున్నారు.
వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటిస్తూ, ఆ పార్టీ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు పర్యటనలతో టిడిపి శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే నేడు చంద్రబాబు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.తూర్పుగోదావరి, విశాఖ జిల్లా( East Godavari, Visakha District )లో ఆయన పర్యటన సాగుతుంది. ప్రజాగళం( PrajaGalam ) సభల్లో చంద్రబాబు తన ప్రసంగాన్ని వినిపించనున్నారు.ఈ మేరకు ఈరోజు ఉదయం శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం అక్కడ నుంచి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగే జగ్గంపేట బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.ఆ తరువాత విశాఖ జిల్లాలోని శృంగవరపు కోటలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.ఈ మేరకు ఈ రెండు జిల్లాల లోను చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారీగా జన సమీకరణ చేపట్టి చంద్రబాబు సభలను సక్సెస్ చేసే విధంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.