ఆర్మాక్స్ సర్వే( Ormax Survey ) తాజాగా ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్( Most Popular Male Stars ) జాబితాను విడుదల చేసింది.2024 సంవత్సరం మార్చి నెల సర్వే ఫలితాలను తాజాగా ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసింది.ఈ జాబితాలో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నంబర్ వన్ స్థానంలో నిలిచారు.షారుఖ్ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న నేపథ్యంలో ఈ స్టార్ హీరోకు నంబర్ వన్ స్థానం దక్కిందని తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.ఈ జాబితాలో రెండో స్థానంలో స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నిలవడం గమనార్హం.సక్సెస్ ఉన్నా ఫెయిల్యూర్ ఉన్నా సర్వేలలో మాత్రం ప్రభాస్ కు తిరుగులేదు.ప్రభాస్ కు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ రాబోయే రోజుల్లో ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ జాబితాలో మూడో స్థానంలో స్టార్ హీరో విజయ్( Hero Vijay ) నిలిచారు.విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరీ అద్భుతాలు సృష్టించకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి.ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh babu ) నాలుగో స్థానం దక్కింది.
పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా నేషనల్ వైడ్ గా మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ జాబితాలో ఐదో స్థానం దక్కింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.
మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో హృతిక్ రోషన్( Hrithik Roshan ) ఏడో స్థానంలో నిలవగా అక్షయ్ కుమార్ ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు.టాప్ 10 జాబితాలో ఐదుగురు టాలీవుడ్ స్టార్స్ కు ఛాన్స్ దక్కడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.