ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.సుమారు 350 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ రోడ్డు తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలను కలుపుతుందని తెలిపారు.
రూ.26 వేల కోట్ల ఖర్చుతో రూపొందిస్తున్న ప్రాజెక్టని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ప్రాజెక్టు వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని తెలిపారు.రూట్ ఎలా ఉండాలనే దానికి 99 శాతం ఆమోదం లభించిందన్నారు.భూ సేకరణ ఖర్చు 50 శాతం కేంద్రమే భరించేందుకు అంగీకరించిందని వెల్లడించారు.భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్న కిషన్ రెడ్డి ఆర్ ఆర్ ఆర్ చుట్టూ ఔటర్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు సర్వే త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిపారు.సర్వే కోసం రైల్వేశాఖ రూ.14 వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు.అదేవిధంగా ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కు రూ.330 కోట్లు కేటాయింపులు జరిగాయన్న ఆయన త్వరలోనే టెండర్లను రైల్వే శాఖ పిలుస్తుందన్నారు.ఈ క్రమంలో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు.